Iragavaram: ఇరగవరం చేరుకున్న 132 బ్యాలెట్ బాక్సులు
Iragavaram: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఇరగవరం మండల పరిషత్ కార్యాలయానికి 132 బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి.
Iragavaram: ఇరగవరం చేరుకున్న 132 బ్యాలెట్ బాక్సులు
ఇరగవరం: ఇరగవరం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి 132 బ్యాలెట్ బాక్సులు సోమవారం ఇరగవరం మండల పరిషత్ కార్యాలయానికి అధికారులు తరలించారు.
ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా బ్యాలెట్ బాక్సులను మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవివి సత్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎ. శ్రీనివాసు, మండల పరిపాలన అధికారి వి.రంగమ్మారెడ్డిలు ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో స్వీకరించారు. అనంతరం
మండల, గ్రామ పంచాయతీ అభివృద్ది అధికారులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు.




