Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికలు.. రెండో రోజు 18 నామినేషన్లు దాఖలు!

Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైకాపా నుంచి 13, తెదేపా నుంచి 5 నామినేషన్లు సమర్పించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 16 Nov 2026 7:28 AM IST
Tanuku
X

Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికలు.. రెండో రోజు 18 నామినేషన్లు దాఖలు!   

Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల కు సంబంధించి రెండో రోజు 18 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో వైకాపా నుం చి 13 మంది అభ్యర్థులు, తెదేపా నుంచి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. తెదేపా తరఫున 16, 36, 38 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

వైకాపా తరఫున 5, 11, 12, 13, 24, 29, 30, 31, 34 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ రామ్‌కుమార్ పర్యవేక్షించారు.

నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల కేంద్రం వద్ద ఎన్నికల సందడి నెలకొంది.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)