Polavaram: అక్రమంగా తరలిస్తున్న 32 పశువుల స్వాధీనం.. 19 మందిపై కేసులు నమోదు

Polavaram: రాజవొమ్మంగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 32 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

PRASANNA, RAMACHANDRAPURAM
Published on: 22 Jun 2026 12:23 PM IST
Polavaram
X

Polavaram: అక్రమంగా తరలిస్తున్న 32 పశువుల స్వాధీనం.. 19 మందిపై కేసులు నమోదు

పోలవరం జిల్లా: రాజవొమ్మంగి మండలంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 32 పశువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని రాజవొమ్మంగి సీఐ ఎస్. గౌరీ శంకర్ తెలిపారు.

పశువుల అక్రమ రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, ఎనిమిది వాహనాల్లో తరలిస్తున్న 32 పశువులను గుర్తించి వాహనాలను సీజ్ చేశారు.

ఈ ఘటనలో 19 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులను గోశాలకు తరలించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఎస్. గౌరీ శంకర్ హెచ్చరించారు.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story