Polavaram: పోలవరంలో 350 మీటర్ల భారీ జాతీయ జెండాతో 'తిరంగా ర్యాలీ'!
Polavaram: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో 350 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ.
Polavaram: పోలవరంలో 350 మీటర్ల భారీ జాతీయ జెండాతో 'తిరంగా ర్యాలీ'!
పోలవరం: ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, ఓ ఎస్ డి జావలి, ఆర్డీవో కే స్వాతి, డి.ఎస్.పి అశ్రఫ్ అలీ పాల్గొని జాతీయ మూడు రంగుల జెండాను రెపరెపలాడే విధంగా వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులతో సుమారు 350 మీటర్ల పొడవున భారీ జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిందనీ ఆయన అన్నారు . ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి భావనలను ప్రతి ఒక్కరిలో పెంపొందించేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్, పిలుపునిచ్చారు. ఈనెల 14వ తారీకు నుండి 15వ తేదీ వరకు రెండు రోజులపాటు ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన తెలిపారు. ఒక మొక్క నాటిన నుండి రోజురోజుకు మొక్క ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా మన భారతదేశం, మన రాష్ట్రం రోజురోజుకు అభివృద్ధి చెందే విధంగా మనమందరం కలిసి కృషి చేయాలని ఆయన అన్నారు.
పోలవరం జిల్లాలోని 12 మండలాల్లో స్వచ్ఛమైన గ్రామాలు, సమాజం, విద్యావంతమైన కుటుంబం, అవినీతిరహిత పరిపాలన కోసం నా వంతు కృషి చేయడం జరుగుతుందని అదేవిధంగా పోలవరం జిల్లాలోని గిరిజన ప్రాంతం అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గిరిజన హక్కులు, అడవి హక్కులు, భూమి హక్కులు, రాజ్యాంగం కల్పించిన రక్షణకు గౌరవిస్తానని గిరిజన చట్టాల పరిరక్షణకు, వారి సాంస్కృతి సాంప్రదాయాల గౌరవానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. అనంతరం
80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్వర్ణాంధ్ర - 2047, విజన్ - 2047 సాధనలో భాగస్వాములు అవుతామని అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ , ఓ ఎస్ డి జావలి, ప్రసంగించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు రుక్మండయ్య, షేక్ అహ్మద్ షరీఫ్, డీఈఓ జి.శ్రీరామ్ మూర్తి, డ్వామా ప్రోజెక్ట్ డైరెక్టర్ రాంప్రసాద్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. ఉమా, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దేవదానం, డిడిఓ వెంకటనారాయణ, ఏపీవో జనరల్ డిఎన్వి రమణ, జిల్లా మలేరియా అధికారి భాస్కర్, తాసిల్దార్ సిహెచ్. బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు, డి సి హెచ్ ఎస్ సాంబశివరావు, డాక్టర్ నీలిమ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ నిర్మల, డి ఈ నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పరిపాలన అధికారులు ఏ.సత్యనారాయణ, ఎర్రం శెట్టి రాజు, హెచ్డిఎఫ్సి మేనేజర్ తీగల మురళీకృష్ణ, పిడీలు, పీఈటీలు, వివిధ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




