Polavaram: పిడుగుపాటుకు 57 మేకలు మృతి!

Polavaram: పోలవరం జిల్లా విఆర్ పురం మండలంలో విషాదం. కొప్పల్లి గ్రామంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి పిడుగుపడి 57 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.

RAJESH REDDY, CHINTOOR
Published on: 17 Jun 2026 7:04 PM IST
Polavaram
X

Polavaram: పిడుగుపాటుకు 57 మేకలు మృతి!

పోలవరంజిల్లా: విఆర్ పురం మండలంలోని రామవరం పంచాయతీ పరిధిలోని కొప్పల్లి గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు 57 మేకలు మృతి చెందాయి. కారం సీతారామయ్య అనే మేకల కాపరి బుధవారం మేకలను కొప్పల్లి గ్రామ సమీపంలోని గోదావరి ఒడ్డుకి మేకలు మేపడానికి తీసుకుని వెళ్ళాడు.

బుధవారం మధ్యాహ్న సమయంలో వర్షం కురుస్తుండడంతో మేకలు గోదారి ఒడ్డున ఉన్న చెట్టు పక్కన ఉన్న పాకలోకి వెళ్లాయి. మేకల కాపరి సీతారామయ్య పాకలోకి వెళ్లకుండా సమీపంలోని చెట్టు వద్దకు వెళ్ళాడు. ఈ సమయంలో వర్షంతో పాటు పిడుగు చెట్టుపై పడటంతో చెట్టు పక్కనే ఉన్న పాకలోని 57 మేకలు మృత్యువాత పడ్డాయి.మేకల కాపరి సీతారామయ్య పాక కిందకు వెళ్లకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

పిడుగుపాటుతో మృతి చెందిన 57 మేకలు కారం మారయ్య, కారం సీతారామయ్య,కారం సీతయ్య, ఉయిక లక్ష్మయ్య, సరియం లక్ష్మయ్య, ఆసు చిన్నమ్మి కి చెందినవి. కొప్పల్లి గ్రామంలో పిడుగుపాటుతో 57 మేకల మృతి చెండటం తో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story