Achanta: ఉపాధి హామీ పనులు నిలిపివేయడం అన్యాయం

Achanta: పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఉపాధి హామీ పనుల నిలిపివేతకు నిరసనగా జూలై 1న అన్ని పంచాయతీ ఆఫీసుల వద్ద ధర్నాలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 29 Jun 2026 8:53 PM IST
Achanta
X

Achanta: ఉపాధి హామీ పనులు నిలిపివేయడం అన్యాయం

Achanta: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఉపాధి హామీ పనులు నిలిపివేయడం అన్యాయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏ రవి అన్నారు. సోమవారం స్థానిక రామేశ్వర స్వామి సత్రంలో ఉపాధి హామీ కూలీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పనులకు వాతావరణం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే ఉపాధి పనులను ఆపివేయడం పేద కూలీల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.

జులై ఒకటో తేదీ నుంచి విబిజి ఆర్ ఎం జి పధకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూలీలకే తెలియకుండా క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.. పేదలకు పట్టెడన్నం పెట్టే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈనెల 30తో రద్దు చేస్తుందని, ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి జులై ఒకటో తేదీన మండలంలో అన్ని పంచాయతీ కార్యాలయ వద్ద ధర్నాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ధర్నాలో గ్రామీణ శ్రామికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాలని కోరారు. . ఇప్పటికే పొమ్మనలేక పొగ పెట్టే పద్ధతిలో పనిముట్లు ఇవ్వడం లేదని అందుకు డబ్బులు కూడా ఇవ్వడం లేదని త్రాగునీరు మెడికల్ ఫిట్ సదుపాయాలు కూడా తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది గ్రామీణ పేదల కడుపు కొట్టే చర్యని అన్నారు.

యాట 200 రోజులు పనులు రోజువారి వేతనం రూ 600 చెల్లించాలని, పాత చట్టాన్ని యథా విధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తలుపురి బుల్లబ్బాయి, పి మోహన్ రావు, సిర్రా నరసింహమూర్తి, కొండేటి సత్యనారాయణ, సిర్రా విగ్నేశ్వరుడు, తోటపల్లి సత్యనారాయణ దొడ్డి నరేష్, విజయ్ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story