Achanta: కొడమంచిలిలో నకిలీ ఇంటి పట్టాల కుంభకోణం

Achanta: ఆచంట మండలం కొడమంచిలిలో నకిలీ ఇంటి పట్టాల పేరుతో వైకాపా నేతలు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు విలేకరుల సమావేశంలో వాపోయారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 2 Oct 2026 10:15 PM IST
Achanta
X

Achanta: కొడమంచిలిలో నకిలీ ఇంటి పట్టాల కుంభకోణం

ఆచంట: ఆచంట నియోజకవర్గంలోని కొడమంచిలి గ్రామంలోని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవగతవగలపై అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ.

పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని నకిలీ ఇంటి పట్టాలు, సీపీ స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఆచంట మండలం కొడమంచిలి శివారు తీర్థాలపుంట, టీ.మెరుక గ్రామాల్లో కలకలం రేపుతున్నాయి. తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఇచ్చిన పట్టాలు బోగస్‌గా తేలడంతో తీవ్రంగా నష్టపోయామని పలువురు ఎస్సీ బాధితులు ఆరోపించారు.

శుక్రవారం కొడమంచిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ ఆరోపణల ప్రకారం.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గ్రామ సర్పంచ్‌ సుంకర సీతారాం, వైసీపీ నాయకుడు బోరుసు రాంబాబు డబ్బులు తీసుకుని ఇంటి పట్టాలు, సీపీ స్థలాలు ఇచ్చారని తెలిపారు. అవి అధికారిక పట్టాలేనని నమ్మించి తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని, అనంతరం వాటి చెల్లుబాటుపై అనుమానాలు తలెత్తడంతో తాము మోసపోయామని పేర్కొన్నారు.

పట్టా కాగితం కాదు.. పేదల సొంతింటి కల

పేదల చేతిలోని ఇంటి పట్టా కేవలం కాగితం కాదని.. అది వారి జీవితకాల సొంతింటి కలకు ఆధారమని బాధితులు అన్నారు. అలాంటి ఆశను ఆసరాగా చేసుకుని మోసం జరిగిందన్న ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. పట్టాల చెల్లుబాటు, సంతకాలు, స్థలాల కేటాయింపు, డబ్బుల లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

ప్రజా దర్బార్‌ పెడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

మాజీ జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ కేత మీరయ్య, బడేటి బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో కాకుండా బాధితుల కోణంలో చూడాలని అన్నారు. వైసీపీ అగ్ర నాయకులు కొడమంచిలిలో ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేసి బాధితుల నుంచి వాంగ్మూలాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.బాధితుల వద్ద ఉన్న పట్టాలు అసలువా? నకిలీవా? వాటిపై ఉన్న సంతకాలు ఎవరివి? డబ్బులు ఎవరికి చెల్లించారు? ఆయా స్థలాలకు ప్రభుత్వ రికార్డుల్లో హక్కులు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.

పేదల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. పట్టాల పేరుతో మోసం జరిగిందన్న ప్రతి ఆరోపణపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA