Achanta: రబీ విత్తనాల ఎంపిక, పంటల బీమాపై రైతులకు అవగాహన!
Achanta: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో రైతు సదస్సు, శాస్త్రవేత్తల ముఖాముఖి నిర్వహించారు.
Achanta: రబీ విత్తనాల ఎంపిక, పంటల బీమాపై రైతులకు అవగాహన!
ఆచంట: ఆచార్య ఎం జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం ఆఖరి సంవత్సరం విద్యార్థులు రైతు సదస్సు మరియు రైతు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమం కొడమంచిలి గ్రామంలో ని ర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మారుటేరు సహా సంచాలకులు డా సిహెచ్ శ్రీనివాస్, రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. కె.వి. రమణమూర్తి, మార్టేరు వ్యవసాయ విస్తరణ ప్రధాన శాస్త్రవేత్త డా. కృష్ణాజీ, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త డా. అప్పారావు , ఉద్యాన శాస్త్రవేత్త డా. సునీత పాల్గొన్నారు మరియు మడల ఏవో పి. నాగరాజు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ నమూనాలను ఆసక్తిగా పరిశీలించారు.
అనంతరం శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పంటల బీమా పథకాల గురించి, వాటి ప్రాముఖ్యత మరియు రైతులకు కలిగే ప్రయోజనాల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. అలాగే రబీ సీజన్‌కు అనువైన విత్తనాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల ప్రాముఖ్యత మరియు రబీ పంటల సాగులో పాటించవలసిన వివిధ వ్యవసాయ యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతులు ఖరీఫ్ సీజన్‌లో తుఫానులు మరియు బలమైన గాలుల ప్రభావానికి తట్టుకొని పడిపోకుండా ఉండే వరి రకాలు ( నాన్ లోడింగ్ వెరైటీస్ ) గురించి శాస్త్రవేత్తలను ప్రశ్నించారు. దీనిపై శాస్త్రవేత్తలు రైతులకు తగిన సూచనలు మరియు సలహాలు అందించారు.
ఈ రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, పంటల బీమా, విత్తనాల ఎంపిక మరియు మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కలిగింది. శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య జరిగిన ఈ పరస్పర చర్చలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి.




