Achanta: ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి

Achanta: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పంచ గ్రామాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు. పూర్తి వివరాలు.

E.ABRAHAM, ACHANTA
Published on: 8 July 2026 12:02 PM IST
Achanta
X

Achanta: ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి

Achanta: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పెనుమంట్ర మండలంలోని మార్టేరు సెంటర్‌లో ఆయన విగ్రహానికి పంచ గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచ గ్రామాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story