Penugonda: స్వామివారిని దర్శించుకున్న ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
Penugonda: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవ గ్రామంలో శ్రీ బాలా పార్వతి చంద్రశేఖర స్వామి వారి ఆలయ పంచమ వార్షికోత్సవం వైభవంగా జరిగింది.
Penugonda: స్వామివారిని దర్శించుకున్న ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
Penugonda: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం, దేవ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలా పార్వతి చంద్రశేఖర స్వామి వారి ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పూజ్యం రామారావు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వెలిచేటి బాబు రాజేంద్రప్రసాద్–వరలక్ష్మి దంపతులు, వెలిచేటి లక్ష్మీ వెంకట శ్రీనివాసు–లీలా కళ్యాణి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
వేడుకల అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




