Achanta: ఆలమూరులో 615 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

Achanta: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో భూ రికార్డుల పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 22 Jun 2026 9:24 PM IST
Achanta
X

Achanta: ఆలమూరులో 615 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

Achanta: పెనుమంట్ర మండలం పరిధిలోని ఆలమూరు గ్రామపంచాయతీ వద్ద సోమవారం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అర్హులైన రైతులకు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్వయంగా 615 పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. రైతులకు భూ యాజమాన్య హక్కులను చట్టబద్ధంగా నిర్ధారించడంలో, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను సక్రమంగా భద్రపరుచుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పలివెల ఆశాలత, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో సుజాత, టీడీపీ నాయకులు కడలి ఏడుకొండలు, కర్రి అయ్యప్పరెడ్డి, తేతలి రామారెడ్డి, జి. శంకరం, సూరెడ్డి దుర్గ, రెవిన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది,కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story