Achanta: అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసిన.. ఎమ్మెల్యే

Achanta: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర ప్రాజెక్టు పరిధిలోని 211 అంగన్‌వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే సత్యనారాయణ ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలను పంపిణీ చేశారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 30 Jun 2026 8:16 PM IST
Achanta
X

Achanta: అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసిన.. ఎమ్మెల్యే

Achanta: అంగన్వాడీ కేంద్రాల్లో వంట కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా, సురక్షితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్‌లను అందించడం అభినందనీయమైన నిర్ణయమని ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ అన్నారు.

మంగళవారం పెనుమంట్ర ప్రాజెక్టు పరిధిలోని పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట మండలాలకు చెందిన మొత్తం 211 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక వంట సదుపాయాలు కల్పించడం వల్ల వంట ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు ఇంధన వ్యయం తగ్గి, కార్యకర్తల శ్రమ కూడా తగ్గుతుందన్నారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, చిన్నారులకు మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం దశలవారీగా అందజేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర ప్రాజెక్టు అధికారి అంగరం కృష్ణకుమారి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story