Achanta: ఆచంట వేమవరంలో ‘ఇంటింటికీ రెండేళ్ల పాలన’ ప్రచారం!
Achanta: వేమవరం గ్రామంలో 'ఇంటింటికీ రెండేళ్ల పాలన' కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ పద్మశ్రీ పాల్గొని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
Achanta: ఆచంట వేమవరంలో ‘ఇంటింటికీ రెండేళ్ల పాలన’ ప్రచారం!
ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామంలో ‘ఇంటింటికీ రెండేళ్ల పాలన’ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో సాగుతోందన్నారు. గ్రామాల్లో ఉన్న చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, డ్రైనేజీ, రహదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆచంట మండలానికి రెండు కోట్ల రూపాయలు జడ్పీ నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యుల వరకు కూటమి అభ్యర్థులకు ప్రజలు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం ఖాయమని పితాని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.




