Penumantra: ఇంటింటికి ప్రగతి సందేశం.. అడుగడుగునా ప్రజా సంక్షేమం!

Penumantra: పెనుమంట్ర క్లస్టర్-2లో 'రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి' యాత్ర 100% పూర్తి కావడంతో ఎమ్మెల్యే పితాని పార్టీ శ్రేణులను ఘనంగా సత్కరించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 14 Aug 2026 8:08 PM IST
Penumantra
X

Penumantra: ఇంటింటికి ప్రగతి సందేశం.. అడుగడుగునా ప్రజా సంక్షేమం!

పెనుమంట్ర: ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం క్లస్టర్‌–2 పరిధిలో ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి’ కార్యక్రమం 100 శాతం పూర్తయిన సందర్భంగా శుక్రవారం మార్టేరు గ్రామంలోని వేణుగోపాల శ్రీ ఆడిటోరియంలో అభినందన సభ నిర్వహించారు. క్లస్టర్‌–2 ఇన్‌చార్జి కర్రి అచ్యుత రామారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహించిన ఇంటింటి యాత్రను విజయవంతంగా పూర్తిచేసిన పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అభినందించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని చేరవేయడంలో పార్టీ కార్యకర్తలు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా క్లస్టర్‌–2 పరిధిలోని తొమ్మిది గ్రామాల టీడీపీ గ్రామ అధ్యక్షులు, యూనిట్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ ఇన్‌చార్జిలు, కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులను శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల యూనిట్‌ బాధ్యులు, బూత్‌ ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story