Achanta: ఆచంటలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ
Achanta: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపకల్పనపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం.
Achanta: ఆచంటలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ
ఆచంట: స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం పై పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్ లు, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు డ్వాక్రా గ్రామ సంఘాల ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపిడిఓ బి కృష్ణ మోహన్ మాట్లాడుతూ ప్రణాళిక ద్వారా గ్రామాలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, మౌలిక వసతుల కల్పన సాధ్యం అన్నారు. అన్ని గ్రామాల్లో అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి కృష్ణ మోహన్, ఎంపీటీసీ దాసిరెడ్డి పుణ్యవతి , ఈఓ ఆర్డీ లు సూరన్న, కృష్ణ వేణి , పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్ లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
Next Story




