Achanta: A.వేమవరం జడ్పీ హైస్కూల్‌లో భూసార పరీక్షలపై అవగాహన
Achanta: ఆచంట మండలం A.వేమవరం జడ్పీ హైస్కూల్‌లో భూసార పరీక్షలపై విద్యార్థులకు అవగాహన. ఆరోగ్యవంతమైన నేలతోనే లాభసాటి వ్యవసాయం: ADA A.V.S. రంగారావు.
Achanta: A.వేమవరం జడ్పీ హైస్కూల్‌లో భూసార పరీక్షలపై అవగాహన
ఆచంట: ది. 22-07-2026 న తాడేపల్లిగూడెం భూసార పరీక్షా కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు A V S రంగారావు, ఆచంట మండలం, A.వేమవరం జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు A.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఆరోగ్యవంతమైన నేలలో లాభసాటి వ్యవసాయానికి భూసార పరీక్షలు అవసరమని సహాయ వ్యవసాయ సంచాలకులు, రంగారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్థూల సూక్ష్మ పోషకాల లభ్యత, భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలని, పోషక పదార్ధాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని మరియు నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడామట్టి పరీక్ష చేయించుకోవాలని తెలియజేశారు.
నేలలు వాటిలో సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రీయ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవడం ద్వారా సమగ్ర ఎరువుల వినియోగం చేపట్టి సాగు వ్యయాన్ని నియంత్రించి, భూసార పరిరక్షణ చేయడంతోపాటుఅధిక మరియు సుస్థిర దిగుబడులను పొందవచ్చని తెలియజేశారు.
రసాయన ఎరువులను ఎక్కువగా వాడటం వలన మొక్కల శాఖీయ భాగాలు బాగా ఎదిగి, అధిక దిగుబడులకు ఆస్కారం ఉన్నప్పటికి రకాల చీడపీడల తాకిడి ఎక్కువై పంట పెట్టుబడి పెరుగుతుందని,నేలలు ఆమ్ల గుణం లేదా క్షార గుణం కలిగిన నేలలుగా మారి, మొక్కలకు పోషకాలను అందించలేని స్థితికి చేరుతాయని తెలియజేశారు.
ఈ సందర్భంలో తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కకు అందించి ప్రామాణిక దిగుబడి పొందడానికి గాను సేంద్రీయ, జీవన ఎరువులను విస్తృతంగా వినియోగించి నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటను ఉత్పత్తి చేయవచ్చునని, ఈ ఎరువులు తక్కువ ధరకు లభ్యమవడంతో పాటు నేలలో సేంద్రీయ కార్బన్ పెరగడానికి దోహదపడి, భూభౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయని వివరించారు.
పై అంశాలను దృష్టిలో ఉంచుకుని భూసార పరీక్ష కేంద్రం , తాడేపల్లిగూడెం వారు పీఎం-శ్రీ పథకం క్రింద విద్యార్దులలో వ్యవసాయంపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం క్రింద పలు శిక్షణ, అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బి నాగరాజు,జిల్లా వనరుల కేంద్రం, భీమవరం వ్యవసాయ అధికారులు శామ్యూల్ జాన్సన్, శ్రీమతి ఎస్.గీతా దేవి మరియు కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి అధిపతి N.మల్లిఖార్జున రావు , పి. వినయ లక్ష్మి తాడేపల్లిగూడెం భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారులు పీవీ.నరసింహారావు, ఫి వెంకట రమణయ్య, బి.సాయి శ్రీ మరియు హై స్కూల్ ఉపాధ్యాయులు E.D.V.ప్రసాద్, K. మల్లిఖార్జున, M.గంగా రత్నం, B.రవి కుమార్ , V.త్రివేణ, CH.సుజాత, D.S.S.R.మూర్తి పాల్గొన్నారు.




