Tanuku: ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక ఎన్జీఓ అవార్డు
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ఉత్తమ ఎన్జీఓ అవార్డు. మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా పురస్కారం అందజేత.
Tanuku: ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక ఎన్జీఓ అవార్డు
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయ కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ఎన్జీఓ విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.
సమాజ సేవలో భాగంగా గత 12 సంవత్సరాలుగా ఆదరణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్రాల పంపిణీతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అవార్డు ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నుంచి అందుకున్నట్లు
ఫౌండేషన్ చైర్మన్ వి. ఆశాజ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డు తమ సేవలకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
Next Story




