Tanuku: విద్యార్థుల బంద్‌కు తణుకు న్యాయవాదుల సంపూర్ణ మద్దతు
Tanuku: ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా తణుకులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు.
Tanuku: విద్యార్థుల బంద్‌కు తణుకు న్యాయవాదుల సంపూర్ణ మద్దతు
Tanuku: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీకి తణుకు న్యాయవాదులు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి విద్యార్థులు దేశవ్యాప్తంగా చేస్తున్న బందుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ నీట్ పేపరు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ,కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
శాంతితంగా పార్లమెంట్ మార్చ్ కు వెళుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి గాయపరచడం, ఆర్ఎస్ఎస్ కు చెందిన కార్యకర్తలు కూడా విద్యార్థులపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులను వారు సరిదిద్దుకోకుండా అవినీతిపరులకు అండగా ఉండటం దుర్మార్గమైన చర్యని దుయబట్టారు.
బిజెపి పార్టీ అధికారంలోనికి వస్తే సంవత్సరానికి నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేసి ఇప్పుడు ఒక ఉద్యోగం కూడా నిరుద్యోగులకు కల్పించకుండా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఉచితంగా ధారాధత్తాన్ని చేస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి అధికారమే
జెయంగా ఉన్నారని ప్రజా సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెలగల సాయిబాబా రెడ్డి జి అంబేద్కర్,ఎం ప్రతాప్ కుమార్, జే రాంబాబు పి సురేష్ పి మురళి తదితరులు పాల్గొన్నారు.




