Tanuku: తణుకులో ఐలు రాష్ట్ర మహాసభల కరపత్రిక విడుదల!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ బార్ అసోసియేషన్ హాల్‌లో కరపత్రిక విడుదల చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 1 Oct 2026 7:30 AM IST
Tanuku
X

Tanuku: తణుకులో ఐలు రాష్ట్ర మహాసభల కరపత్రిక విడుదల!

Tanuku: మాజీ ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ పిలుపునిచ్చారు. మహాసభల కర పత్రికను ఆయన తణుకు బార్ అసోసియేషన్ హాల్లో బుధవారం విడుదల చేసి మాట్లాడారు. న్యాయవాదుల, న్యాయ విద్యార్ధుల సమస్యలపై పోరాడుతున్న ఐలు జరుపుకునే 13 మహాసభ ను జయప్రదం చేయాలని న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. ఐలు జిల్లా ఉపాధ్యక్షులు

కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు,న్యాయ వ్యవస్థ పై పెరుగుతున్న ఒత్తిడిపై ఈ మహాసభలో చర్చిస్తారాని రాబోయే కాలానికి కర్తవ్యాలను రూపొందిస్తారని తెలిపారు.

ఈ మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా వేయి మంది డెలికేట్స్తో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరవుతారని వెల్లడించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కామన మునిస్వామి,ఈదా రామకృష్ణ, కోటిపల్లి అయ్యప్ప,రాపాక ప్రభాకర్, కేఎల్ సత్యవతి,లంకా రాంబాబు, దొమ్మేటి సూర్యనారాయణ, ఏలూరు చిట్టి మోషే, డి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)