Amalapuram: ఆరోగ్య సమాజం కోసం పోలియో చుక్కలు వేయించాలి ఎమ్మెల్యే

Amalapuram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని ఈడబ్ల్యూఎస్ (EWS) కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో

SURESH, AMALAPURAM
Published on: 28 Jun 2026 12:35 PM IST
Amalapuram
X

Amalapuram: ఆరోగ్య సమాజం కోసం పోలియో చుక్కలు వేయించాలి ఎమ్మెల్యే 

అమలాపురం: పట్టణంలోని మార్కెట్ వద్ద గల ఈడబ్ల్యూఎస్ (EWS) కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీలోని చిన్నారులకు ఎమ్మెల్యే ఆనందరావు మరియు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు గారు కలిసి స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే ఆనందరావు గారు మాట్లాడుతూ.

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి, పోలియో రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.

ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా ఈ చుక్కల మందు వేయించి,వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలన్నారు.మున్సిపల్ పరిధిలోని ప్రతి చిన్నారికి వ్యాక్సిన్ అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

ప్రజారోగ్యానికి మన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీల ముఖ్య నాయకులు,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story