Achanta: పింఛన్ దరఖాస్తు గడువు పెంచాలి: దివ్యాంగ్ జేఏసీ డిమాండ్!
Achanta: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ దరఖాస్తు గడువు పొడిగించాలని, సర్టిఫికెట్ల సమస్యను పరిష్కరించాలని పోడూరులో అఖిలభారత్ దివ్యాంగ్ జేఏసీ డిమాండ్ చేసింది.
Achanta: పింఛన్ దరఖాస్తు గడువు పెంచాలి: దివ్యాంగ్ జేఏసీ డిమాండ్!
ఆచంట: అఖిలభారత్ దివ్యాంగ్ ఐక్య కార్యచరణ కమిటీ ఆర్ సి నెంబర్ 290/2025 ఏపీలో పింఛన్ దరఖాస్తు గడువు పెంచాలి సర్టిఫికెట్ల ఇబ్బందులు తొలగించాలి. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో అఖిల భారత దివ్యాంగ జేఏసీ సెక్రటరీ కందుల సురేష్ యాదవ్ మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రారంభమైన పింఛన్ల దరఖాస్తు ప్రక్రియలో దివ్యాంగులు, వృద్ధులు
తీవ్రఇబ్బందులుపడుతున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఇవ్వడం వల్ల అర్హులైన చాలా మందికినష్టంజరిగేఅవకాశం ఉంది.ఇన్‌కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరిగినా తక్కువ సమయంలో అవి చేతికి అందడం కష్టంగా మారుతోంది. సర్వర్లు సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారాయి.
కావున అఖిలభారత్ దివ్యాంగ్ జేఏసీ ( ఆల్ ఇండియా దివ్యాంగ జేఏసీ ) తరపున ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము పింఛన్ దరఖాస్తు గడువును వెంటనే పొడిగించాలి.
దివ్యాంగులకు ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు త్వరగా, సులభంగా వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం స్పందించి దివ్యాంగులకు న్యాయం చేయాలనిప్రభుత్వాన్నికోరుతున్నాముఅని అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత్ దివ్యాంగ్ జేఏసీ ( ఆల్ ఇండియా దివ్యాంగ జీఏసి ) ఉండి నియోజకవర్గం జెఎసి అధ్యక్షులు పోనిపి రెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు అంగర బాలాజీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




