Akividu: సిద్దాపురం సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ మహేష్ వర్మ సతీమణి పోటీ
Akividu: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మహేష్ వర్మ సతీమణి ప్రణీత పోటీ.
Akividu: సిద్దాపురం సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ మహేష్ వర్మ సతీమణి పోటీ
ఆకివీడు: ఆకివీడు మండలం సిద్దాపురం గ్రామ సర్పంచ్ స్థానానికి ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కలిదిండి మహేష్ వర్మ సతీమణి ప్రణీత పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పోటీకి సంబంధించిన వివరాలను డాక్టర్ మహేష్ వర్మ మీడియాకు వెల్లడించారు.
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆశీస్సులతో ఈ స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు డాక్టర్ మహేష్ వర్మ తెలిపారు. గత ఏడేళ్లుగా సిద్దాపురం గ్రామంలో తమ కుటుంబం ఆధ్వర్యంలో అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గ్రామ ప్రజలకు మరింత చేరువై సేవ చేసేందుకు ఈ ఎన్నికలను ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నామని మహేష్ వర్మ అన్నారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సిద్దాపురం ఓటర్లు తమకు అండగా నిలవాలని, తమ అభ్యర్థి ప్రణీతకు ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




