Tanuku: సెప్టెంబర్ 26న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా మహాసభలు!

Tanuku: సెప్టెంబర్ 26న భీమవరంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా మహాసభలు. తణుకు బార్ అసోసియేషన్‌లో కరపత్రాల ఆవిష్కరణ.. న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 22 Sept 2026 8:14 PM IST
Tanuku
X

Tanuku: సెప్టెంబర్ 26న ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా మహాసభలు!

తణుకు: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు. ఈ నెల 26న భీమవరంలో నిర్వహించనున్న జిల్లా మహాసభకు సంబంధించి కర పత్రాలను బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బిoకం రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బార్ అసోసియేషన్ భవనంలో ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.

ఆలిండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదుల కోసం, న్యాయ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజా సమస్యలపై పనిచేసే యూనియన్ అన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవాదులకు వృత్తి రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వాo చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోట్ల సురేష్ జి.అంబేద్కర్, కొండా శ్రీనివాసరావు K. స్వామి, షేక్ అబ్దుల్ రహీం,తానేటి వెంకటేశ్వరావు, ఈదర జ్యోతి బాబు,v.మురళి తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)