Narasapuram: నరసాపురంలో కూటమి ప్రభంజనం: కొత్తపల్లి శైలజ గెలుపు

Narasapuram: నరసాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి 31 వార్డులు గెలిచింది. చైర్‌పర్సన్‌గా కొత్తపల్లి శైలజ 17,069 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 3 Nov 2026 7:55 PM IST
Narasapuram
X

Narasapuram: నరసాపురంలో కూటమి ప్రభంజనం: కొత్తపల్లి శైలజ గెలుపు

నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఆధిపత్యం చాటుకుంది. మొత్తం 36 వార్డులకు జరిగిన ఎన్నికల్లో జనసేన 15, టీడీపీ 15, వైసీపీ 4, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒక వార్డులో విజయం సాధించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో కూటమి అభ్యర్థి కొత్తపల్లి శైలజ జానకిరామ్, వైసీపీ అభ్యర్థి కావలి రామసీతపై 17,069 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

ఓట్ల వివరాలను పరిశీలిస్తే జనసేనకు 24,580 ఓట్లు, వైసీపీకి 7,511, కాంగ్రెస్‌కు 262 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 246 ఓట్లు రాగా, 765 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. విజయం అనంతరం నూతన చైర్‌పర్సన్ కొత్తపల్లి శైలజ జానకిరామ్ మాట్లాడుతూ తనను గెలిపించిన నరసాపురం పుర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పట్టణంలోని ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం అభిమానులు, కార్యకర్తల మధ్య రోడ్‌షోలో పాల్గొన్నారు. బాణసంచా కాల్పులు, భారీ ర్యాలీ, అభిమానుల నినాదాల మధ్య పట్టణంలో విజయోత్సవాలు నిర్వహించారు. దీంతో నరసాపురంలో పండుగ వాతావరణం నెలకొంది.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM