Penumantra: వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్ల సమస్యలు పరిష్కరించాలి: రవీంద్ర రాజు!
Penumantra: ఆంధ్రప్రదేశ్‌లో వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెనుమంట్రలో అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు డిమాండ్ చేశారు.
Penumantra: వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్ల సమస్యలు పరిష్కరించాలి: రవీంద్ర రాజు!
పెనుమంట్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్లు, సమస్యలు పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరిన ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు.
గత నెల ఆగస్టు 19వ తేదీన సిసిఎల్ఏ కార్యాలయం వద్ద వారి సమస్యలపై వీఆర్ఏ జేఏసీ నాయకులు తీసుకున్న నిర్ణయం ప్రకారం సీసీఎల్ఏ కార్యాలయము వద్ద నిరసన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మద్దతు తెలిపి వారి సమస్యలు పరిష్కారం కోసం గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం కోసం సీసీఎల్ఏ అధికారులకు గత ఆగస్టు 19వ తేదీన సెప్టెంబర్ 15వ తేదీ లోపు వీఆర్ఏల, వీఆర్వోలు, సర్వేర్లు, సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రెవెన్యూ విధులలో సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయం తీసుకుని అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఇప్పటివరకు వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్లు సమస్యలపై ఉన్నతాధికారులు ప్రభుత్వ దిష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోనందున రాష్ట్రంలో అతి తక్కువ జీతంతో రెవెన్యూ శాఖలో కీలకంగా పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా, రెవెన్యూ మంత్రి ఈనెల 5 న తేదీన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్లు సమస్యలపై వెంటనే సమావేశం ఏర్పాటు చేసి రెవిన్యూ లో ఉన్న సమస్యలుపరిష్కరించాలని కోరగా వెంటనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో కూడా మాట్లాడి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి వీఆర్ఏ, వీఆర్ఓ, సర్వేర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
అప్పటి నుండి అనేకకార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల మీటింగు ఏర్పాటు చేయలేకపోయామని రెవిన్యూ మంత్రివర్యుల ఈనెల 12వ తేదీన ఫోన్లో సంప్రదించగా బిజీగా ఉండడం వల్ల మీటింగ్ ఏర్పాటు చేయలేకపోవడం జరిగిందని వినాయక చవితి తర్వాత త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్లు, సమస్యలపై చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
కానీ వీఆర్ఏ జేఏసీ నాయకులు క్రింద స్థాయి నుండి వారికున్న ఒత్తిడిల వల్ల అనుకున్న ప్రకారం కార్యచరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీఆర్వోలు, సర్వేర్లు రెవెన్యూ మంత్రి మాట ప్రకారం త్వరలోనే అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తారని మా యొక్క కార్యచరణను ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది.
వీఆర్ఏల కార్యచరణకు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ మద్దతుగా వారికి సంఘీభావంతెలియజేయడం జరుగుతుంది. అందువలన రెవెన్యూ మంత్రి వెంటనే వీఆర్ఏల యొక్క ఆందోళనను అర్థం చేసుకుని వెంటనే వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్లు సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరిన అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు.




