Tanuku: తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు!

Tanuku: గ్రంథాలయ వార్షికోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో అధ్యక్షురాలు వావిలాల సరళదేవి శనివారం జెండా ఆవిష్కరించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 14 Nov 2026 8:38 PM IST
Tanuku
X

Tanuku: తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు!

Tanuku: గ్రంథాలయ వార్షికోత్సవం, నెహ్రూ జయంతిని పురస్కరించుకుని తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధ్యక్షరాలు వావిలాల సరళదేవి జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభిచారు.తొలుత ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గ్రంథాలయ వ్యవస్థాపకులు అయ్యంగి వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి మాట్లాడారు.

యువత చరవాణిని పక్కన పెట్టి పుస్తక పఠనానికి ప్రధాన్యత నిస్తే బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు అనంతరం గ్రంథాలయాల ప్రాముఖ్యత, నెహ్రూ జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సప్పారాజు లైబ్రరీన్ కృష్ణారావు, ఎం జ్యోతి, కే శ్యామల, జవ్వాది లక్ష్మి, పొప్పుల లక్ష్మి చదవరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)