Surampudi: ఉపాధి హామీని కాపాడుకుందాం.. కూలీలకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు!

Surampudi: ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Jun 2026 1:19 PM IST
Surampudi
X

Surampudi: ఉపాధి హామీని కాపాడుకుందాం.. కూలీలకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు!

Tanuku: ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించడానికి కూలీలంతా ఐక్యం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్ర రావు కోరారు. ఇరగవరం మండలం సూరంపూడి గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనిలో జులై 1వ తేదీ నుండి కొత్తగా తీసుకు వచ్చి అమలు చేస్తున్న విబిజి రాంజీ పథకం వలన కూలీలకు జరిగే నష్టాన్ని ఆయన వివరించారు.

గతంలో ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే విధులు కేటాయించేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా తీసుకువస్తున్న వి బి జి రాంజీ పథకాని కి కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు భరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా 2500 కోట్లు భారం పడుతుందని ఈ భారాన్ని భరించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడానికి 10 వేల కోట్లు కేటాయించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలీలకు ఎక్కువ రోజులు పని కల్పించేందుకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story