Tanuku: నారీ శక్తి వందన్ అధినియం వెంటనే అమలు చేయాలి ఏపీ మహిళా సమాఖ్య

Tanuku: తణుకు ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అమలుకై ఏపీ మహిళా సమాఖ్య సంతకాల సేకరణ. 11 నుండి పోస్టుకార్డుల ఉద్యమానికి పిలుపు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 4 July 2026 9:09 PM IST
Tanuku
X

Tanuku: నారీ శక్తి వందన్ అధినియం వెంటనే అమలు చేయాలి ఏపీ మహిళా సమాఖ్య

తణుకు: జనగణన,నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)ను రాబోయే ఎన్నికల నుంచే అమలు చేసి, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించాలని ఏపీ మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి డిమాండ్ చేశారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తణుకు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆవరణలో శనివారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలంటే ఎలాంటి షరతులు విధించకుండా మహిళా రిజర్వేషన్ల బిల్లును వెంటనే అమలు చేయాలని కోరారు. సంతకాల సేకరణ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సమీకరించి ఈ నెల 6న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.

అలాగే పార్లమెంట్ సభ్యులకు వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, మహిళా సమాఖ్య తణుకు ఏరియా కార్యదర్శి వలవల అరుణకుమారి, ఉపాధ్యక్షురాలు పిండి సత్యవతి, కోశాధికారి పట్టపు కృష్ణవేణి, వలవల మంగతాయారు, ఏలూరి దుర్గ, అరవపల్లి దుర్గ, డి. లక్ష్మిదేవి, కె. రత్నకుమారి, పి. విజయలక్ష్మి, కె.ఎస్. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story