Bhimavaram: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: ఎస్‌ఈసీ!

Bhimavaram: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 19 Aug 2026 6:46 PM IST
Bhimavaram
X

Bhimavaram: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: ఎస్‌ఈసీ!

Bhimavaram: స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనిల్ చంద్రపునీత, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

బుధవారం అమరావతి, సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు,జిల్లా పంచాయతీ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరిస్తూ జిల్లాలో మొత్తం 5 పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీ, 409 గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. వీటిలో 16 గ్రామాలకు సంబంధించి కోర్టు కేసులు పరిష్కా రానికి పెండింగ్లో ఉన్నాయని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత పారద ర్శకంగా, ప్రణాళిక బద్ధంగా నిర్వహించ డానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులు, మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ వేగవంతం చేయడం జరుగు తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా ఇప్పటికే ఖరారు చేయటం జరిగింద ని.

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఓటింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయటం జరుగు తుందని అన్నారు. సామాజిక వర్గాల ఓటర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు సంబంధించిన ఎలక్ట్రోరల్ రోల్స్ సిద్ధం చేసే ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని కచ్చితంగా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 20 మండలాల్లో 409 పంచాయతీలలో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహణకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపడం జరిగింద న్నారు. మొదటి విడతలో నరసాపు రం డివిజన్లో 8 మండలాలలోని 165 పంచాయ తీలు. తాడేపల్లి గూడెం డివిజన్లోని ఇరగవరం అత్తిలి రెండు మండలాల్లో ని 39 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు.

రెండవ విడత లో భీమవరం డివిజన్ 7 మండలాలలో 143 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం డివిజన్ లో పెంటపాడు, తణుకు తాడేపల్లిగూడెం మూడు మండలాల లో 62 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో మొత్తం 4వేల579 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా వీటిలో సుమారు 3వేల366 పోలింగ్ కేంద్రాలను ఆన్లైన్లో మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగు తుందని అన్నారు.

ఓటర్ల జాబితాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి ఇతర వర్గాల ఓటర్ల గుర్తింపు అధికారి కంగా నియ మించాలని దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేయటం జరిగిందని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసిందని అన్నారు.

పోలింగ్ కేంద్రాల ముసాయి దా జాబితా తయారీ ఆగస్టు 21వ తేదీ, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణకు 23వ తేదీ, వినతులు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 26 తేదీ, కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా ఆమోదానికి 29వ తేదీ, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణకు ఆగస్టు 31వ తేదీ గా షెడ్యూల్లో పేర్కొనడం జరిగిందని అన్నారు.

** ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపుకు జిల్లా పంచాయతీ అధికారి నియ మించిన కార్యదర్శు లు, మినిస్టీరియల్ సిబ్బంది ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రచురణ సరిగ్గా జరిగేలా చూడాలని అన్నారు.

నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 18 వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఓటర్ల ఇంటింటి సర్వే, 23వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఓటర్ల గుర్తింపు, 25వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ, 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అభ్యర్థుల అభ్యంత రాలు దాఖలు చేయడానికి సమయం, 29వ తేదీ నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు అభ్యంతరాల పై విచారణ, ముగింపు ఎస్సీ ఎస్టీ బీసీ మార్కింగ్ తో ముసాయిదా ఓటర్ల జాబితా రూపకల్పన, మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు గ్రామ సభలో జాబితాల ధ్రువీకరణ, సెప్టెంబర్ ఏడవ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల మార్కింగ్ తో ఉన్న తుది జాబితా తయారు చేయడం, ప్రచురించడం జరుగుతుందని అన్నారు.

జిల్లాలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారమే ఎన్నికలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారి అనూరాధ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story