Tanuku: అధికారుల నిర్లక్ష్యం వీడకపోతే మూల్యం తప్పదు!
Tanuku: తేతలి జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Tanuku: అధికారుల నిర్లక్ష్యం వీడకపోతే మూల్యం తప్పదు!
తణుకు: తేతలి జగనన్న కాలనీలో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్ర రావు హెచ్చరించారు. తణుకు మండలం తేతలి ప్రభుత్వ కాలనీలో నివాసం ఉంటున్న నివాసిత కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.ధర్నాకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పివి. ప్రతాప్ పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం తహసిల్దార్ అశోక్ వర్మకి వినతిపత్రాని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి గ్రామంలో కొత్తగా కాలనీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు అవసరమైన త్రాగునీరు. రోడ్లు. డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాలనీ ఏర్పడి నాలుగు సంవత్సరాలైనా కాలనీలో ప్రజలకు కనీస వసతులు కల్పించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టి దాదాపు మూడు వారాలైన నేటికీ అధికారులు కాలనీకి వచ్చి సమస్యలు పరిశీలించిన దాఖలాలు లేవని వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు అధికారులు.
ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బండారు వెంకటేశ్వర్లు. ఇందుకూరి రామరాజు. వేండ్ర శివప్రసాద్. గార రంగారావు. సిహెచ్ రాజా. పంపన విజయ్ బాబు వెంకటలక్ష్మి. పంపన సత్యనారాయణ. బి నాగరాజు నాగరత్నం. మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




