P Gannavaram: స్తంభించిన లంక గ్రామాల రాకపోకలు!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద నీటితో మునిగిన అప్పనపల్లి, కనకాయలంక మరియు ఎదురుబిడియం కాజ్వేలు.

RAJU, P GANNAVARAM
Published on: 2 Aug 2026 9:51 AM IST
P Gannavaram
X

P Gannavaram: స్తంభించిన లంక గ్రామాల రాకపోకలు!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాపి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే వరద నీటితో ముంపునకు గురైంది.

కాజ్వేపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది.

దీంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపి వేసి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కు అధికారులు చర్యలు చేపట్టారు.

కాజ్వేకు ఇరు వైపులా అధికారులు బందోబస్తు ఏర్పాటుచేశారు.

వరద నీటి ఉధృతికి పి. గన్నవరం మండలం మండలం చాకలిపాలెం,కనకాయలంక కాజ్వేలు మునక.. అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే లు మునక పడవలు ఏర్పాటు చేసిన అధికారులు, పడవలపై ప్రయాణం సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story