Tanuku: జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కోర్కెల దినోత్సవం. తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 4 Oct 2026 10:02 AM IST
Tanuku
X

Tanuku: జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్!

Tanuku: వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించి, సంక్షేమ చర్యలు చేపట్టాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో తణుకులో కోర్కెల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఎ.నారాయణకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జర్నలిస్టులు అందజేశారు.

పెండింగ్ సమస్యలు పరిష్కరించి, రైల్వే రాయితీ పాసులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు 3 సెంట్ల స్థలం, ఆరోగ్య భద్రత కల్పించి, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బెల్లంకొండ బుజ్జిబాబు, కొడమంచిలి కృష్ణ, పమ్మి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)