Penumantra: ఉపాధిహామీ కూలీల పొట్టకొట్టే విధంగా బి.వి.రాంజీ పథకం

Penumantra: పొలమూరు సచివాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నిరసన. వీబీ గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేసి, రోజువారీ కూలీ రూ.600 ఇవ్వాలని చిన వీరభద్రరావు డిమాండ్.

E.ABRAHAM, ACHANTA
Published on: 2 July 2026 9:09 PM IST
Penumantra
X

Penumantra: ఉపాధిహామీ కూలీల పొట్టకొట్టే విధంగా బి.వి.రాంజీ పథకం

పెనుమంట్ర: వి బి గ్రామ్ జి పథకాన్ని రద్దుచేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్ర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ డి. వేణు కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూలీలకు ఒక వరముగా ఒక హక్కుగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో ఎటువంటి హక్కు లేని కూలీల పొట్ట గోట్టే విధంగా వి బి గ్రామ్ జి తీసుకు వచ్చి ఈ పథకాన్ని కూలీలకు బిక్షగా మార్చడం సరికాదని వీరభద్ర రావు విమర్శించారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి యధావిధిగా అమలు చేసి ప్రతి కుటుంబానికి 200 దినాలు పెరిగిన ధరల కనుగుణంగా కనీస వేతనం రూ.600 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పంపన సూర్యనారాయణ. నరసింహమూర్తి. సుబ్బారావు. మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story