Narasapuram: నరసాపురం తీరంలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. అతలాకుతలమైన గ్రామాలు!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు మండలాల్లో అర్నాబ్ తుఫాను తీవ్ర రూపం. 140-150 కిమీ వేగంతో వీచిన భీకర గాలులకు కూలిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు.
Narasapuram: నరసాపురం తీరంలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. అతలాకుతలమైన గ్రామాలు!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంత మండలాలైన నరసాపురం, మొగల్తూరులో అర్నాబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. భీకర ఈదురుగాలుల ధాటికి ఇళ్లు దెబ్బతిన్నాయి.. భారీ వృక్షాలు నేలకొరిగాయి.. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కొబ్బరి, తాటి చెట్లు సైతం నేలమట్టమయ్యాయి.
గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు సమాచారం. తుఫాన్ దెబ్బకు పలు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి.
తీర ప్రాంతంపై తుఫాన్ విరుచుకుపడటంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. భీకర గాలుల ధాటికి భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు కూలిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇళ్ల పైకప్పులు దెబ్బతినడంతో బాధితులు తలదాచుకునేందుకు ఆశ్రయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుతాళ్లు,సీతారాంపురం, మర్రితిప్పతో పాటు పలు గ్రామాల్లో రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రొక్లైనర్ల సాయంతో చెట్లను తొలగిస్తూ రహదారులను పునరుద్ధరిస్తున్నాయి.
మరోవైపు తుఫాన్ బాధితులను నరసాపురం పట్టణంలోని మిషన్ హైస్కూల్ తో పాటు నియోజవర్గంలో 24సా పునరావాస కేంద్రాలకు తరలించి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసి, నిరాశ్రయులైన కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని బాధితులు కోరుతున్నారు.
తుఫాన్ దెబ్బకు తీర ప్రాంతం అతలాకుతలం.. నిలిచిన విద్యుత్ సరఫరా.. దెబ్బతిన్న ఇళ్లు.. నేలకొరిగిన వృక్షాలు.. సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణ సాయం అందించాల్సిన అవసరం ఏర్పడింది.




