Bhimavaram: భీమవరంలో హోరెత్తిన ‘బడి పిలుస్తోంది’ ప్రచార భేరి
Bhimavaram: భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ‘బడి పిలుస్తోంది’ ప్రచార భేరిని ప్రారంభించారు.
Bhimavaram: భీమవరంలో హోరెత్తిన ‘బడి పిలుస్తోంది’ ప్రచార భేరి
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం: మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఒక్క అడుగు ప్రభుత్వ బడి వైపు చూసి రావాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. గురువారం భీమవరం బ్యాంక్ కాలనీలో జిల్లా విద్యాశాఖ, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది ప్రచార భేరి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఈ విద్య సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని, అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ఉచిత విద్య బోధన, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం వర్తింపు అని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నామని అన్నారు. ఎంఈవో కి శ్రీనివాసరావు, మీ సాయిరామ్, కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో బుక్స్, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, మధ్యాహ్న భోజన పథకం, ఆధునిక వసతి కల్పన వంటి సౌకర్యాలను కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కొండ్రు శ్రీనివాస్, సిఆర్ పిలు ఏయు రమణ, ఎస్ నాగార్జున, ఎస్ నాగలక్ష్మి, సిహెచ్ విజయ కుమారి, వై ఆర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.




