Malikipuram: స్కూల్ ఆటోలో చెలరేగిన మంటలు.. 12 మంది పిల్లలు సేఫ్!
Malikipuram: కోనసీమ జిల్లా మలికిపురంలో భాష్యం స్కూల్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో 12 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు
Malikipuram: స్కూల్ ఆటోలో చెలరేగిన మంటలు.. 12 మంది పిల్లలు సేఫ్!
మలికిపురం : డాక్టర్. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురంలో సోమవారం ఉదయం స్కూల్ పిల్లలకు పెను ప్రమాదం తప్పింది.మలికిపురం ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో వెళ్తున్న భాష్యం స్కూల్ ఆటో ఇంజన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
గూడపల్లి గ్రామం నుంచి సుమారు 12 మంది విద్యార్థులను స్కూల్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఆటోలో సమస్యను వెంటనే గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పిల్లలందరినీ వెంటనే ఆటో నుంచి సురక్షితంగా దింపాడు.
అనంతరం స్థానికులు సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.ఈ ఘటనలో విద్యార్థులకు గానీ, డ్రైవర్‌కు గానీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే డ్రైవర్ కూర్చునే క్యాబిన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది.డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని, దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు




