Penugonda: పెనుగొండ భాష్యం పాఠశాలలో వైభవంగా వినాయక చవితి!
Penugonda: పెనుగొండ భాష్యం పాఠశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. మట్టి గణపతులనే పూజించాలని హెచ్ఎం ఎన్.వి. అప్పారావు పిలుపు. విద్యార్థులకు గణపతి వ్రతకథ పుస్తకాల పంపిణీ.
Penugonda: పెనుగొండ భాష్యం పాఠశాలలో వైభవంగా వినాయక చవితి!
పెనుగొండ: స్థానిక కంబాల వారి వీధిలో గల భాష్యం పాఠశాలలో ది: 11-09-26 శుక్రవారంనాడు *విద్యార్థుల సందడితో,ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా "వినాయక చవితి" వేడుకలు భక్తి,శ్రద్ధ,సంప్రదాయాల సమ్మేళనంగా ఎంతో వైభవంగా నిర్వహించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్ వి అప్పారావు గారు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు కలిసి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించి,ఉత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి,ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని,భక్తి గీతాలు,శ్లోకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు మరింత శోభను తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వినాయక చవితి ప్రాముఖ్యతను,మన సంస్కృతి–సంప్రదాయాలను విద్యార్థులకు వివరించారు.
వినాయకుడు జ్ఞానం,వివేకం,విజయానికి ప్రతీక అని,ప్రతి కార్యాన్ని మంచి ఆలోచనతో,క్రమశిక్షణతో ప్రారంభించాలని సూచించారు. ప్రకృతికి హానికరమైన వివిధ రంగులతో కూడిన వినాయకుడిని నిషేధించమని, ప్రకృతికి మేలు చేయు మట్టి వినాయకుడిని పత్రి ఫలములు పిండి పదార్థములతో పూజించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహభరితంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం “గణపతి బప్పా మోరియా” నినాదాలతో మార్మోగింది.అనంతరం బాలగణపతి వేషధారణలో ఉన్న విద్యార్థి విద్యార్థులకు భాష్యం వారి గణపతి వ్రత కథ విధానాన్ని తెలుపు పుస్తకాన్ని పంపిణీ చేశారు.
ఈ వేడుకలు విద్యార్థుల్లో భక్తిభావంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా సాగాయి. ఆనందం, ఆధ్యాత్మికత, ఐక్యత కలగలిసిన ఈ వినాయక చవితి వేడుకలు విద్యార్థుల మదిలో మధుర జ్ఞాపకాలుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత శ్రీ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి గారు చాంప్స్ ఇంచార్జ్ శ్రీమతి రాణి రోజాజీ గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.




