Bhimavaram: గీత వృత్తిని సంక్షోభంలోకి నెడుతున్నారు జుత్తిగ నరసింహమూర్తి

Bhimavaram: చంద్రబాబు ప్రభుత్వం కల్లుగీత వృత్తిని సంక్షోభంలోకి నెడుతోందని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం నేత జుత్తిగ నరసింహమూర్తి విమర్శించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 7 Oct 2026 11:20 PM IST
Bhimavaram
X

Bhimavaram: గీత వృత్తిని సంక్షోభంలోకి నెడుతున్నారు జుత్తిగ నరసింహమూర్తి

భీమవరం: పూర్వకంగానే సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఎ పి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి విమర్శించారు.సంఘం ఆధ్వర్యంలో బుధవారం భీమవరం C I T U కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నరసింహమూర్తి మాట్లాడుతు రాష్ట్రంలో కల్లు (అమృతం) నీరాను బీరు, బ్రాందీ, విస్కీల మాదిరిగా బార్లు, హోటల్సలలో అమ్మించే విధంగా ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.

పాలు మాదిరిగా కల్లుకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న గీత వృత్తిని బహుళ జాతి మద్యం కంపెనీల కోసం, ప్రభుత్వంలో కొందరి పెద్దల ప్రయోజనాల కోసం ఘన చరిత్ర కలిగిన కల్లుగీత వృత్తిని ధ్వంసం చేస్తున్నారని దుయ్యాబట్టారు. ఈరోజు కి గీత వృత్తికి సమగ్ర చట్టం లేదు గీత కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత లేదని అన్నారు.

నరమాంసానికి రుచి మరిగిన పెద్దపులిలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.కల్లు అమ్మకాలు లేక వృత్తిలో బ్రతకలేక ఉన్న ఊరిని,కన్న తల్లి, భార్య పిల్లలను వదిలేసి పొట్ట చేత పట్టుకొని ఇతర పనులు వెతుక్కుంటూ బతకటం కోసం వలసలు పోతున్నారని అన్నారు. ప్రజలతో ప్రభుత్వమే కావాలని తాగిస్తూ మరోవైపు పింఛన్లు సొమ్ముతో తాగేస్తున్నారని అవమానించడము తగదన్నారు.

ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల, సిండికేట్లు సేవలో తపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆల్కహాల్, కెమికల్స్ తో తయారు చేసిన బీరు, బ్రాందీ,విస్కీలను ప్రోత్సహిస్తూ ఆరోగ్య నికి ఎంతో ఉపయోగం పడే నేచురల్ గా వచ్చే కల్తీ లేని పానీయానికి అమ్మకాలు లేకుండా చేయటం దుర్మార్గం అన్నారు.గతంలోనూ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గీత కార్మికులను అనగదొక్కటమే కానీ ఆదుకున్నది లేదు అని గీత కార్మికులు తీవ్రమైన అసంతృప్తితో, ఆవేదనతో ఉన్నారని అన్నారు.

కల్లు సొసైటీ లకు 20 శాతం మద్యం షాపులు ఇస్తామని వాగ్దానం చేసి మాట తప్ప లేదా? అన్నారు. వృత్తిలో చనిపోయిన వారి కుటుంబానికి ఇచ్చే ఎక్స్గ్రేషియోను రద్దు చేయటాన్ని గీత కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.గీత వృత్తిని ధ్వంసం చేస్తూ బతుకు తెరువు లేకుండా చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చోబోమని మా సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈరోజు గీత కార్మికుల కుటుంబాలలో చంద్రబాబు కన్నీరు పెట్టిస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం స్పందించి తక్షణమే కల్లు గీత వృత్తిపై అధ్యయనం కోసం కమిషన్ వేయాలని కల్లు పులుసుపోకుండా నిల్వ ఉంచే విదంగా కోల్డ్ స్టోరేజీలు,ఇతర సాంకేతిక పద్ధతులు ఏర్పాటు చేయాలని తాటి చెట్లు ఎక్కటానికి తెలంగాణలో ఇస్తున్నట్లు సేఫ్టీమోకులు ఇవ్వాలని కల్లును క్వాలిటీ నిలబెట్టడానికి ప్రాసెసింగ్ యూనిట్లను ఉపయోగించి పాలు మాదిరిగా ప్రాసెస్ చేసి 15 రోజుల వరకు స్టోర్ చేసే టెక్నాలజీనీ ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికులకు 5 లక్షలు ఎక్స్గ్రేషియో ఇస్తుంటే ఆంధ్రాలో చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించ్చారు. గీత వృత్తిని కాపాడుకునేందుకు, సమస్యలు పరిష్కారం కోసం చేపట్టిన కల్లు గీత కార్మిక బతుకు పోరాట గర్జనకు గీత కార్మికులు అందరూ 9వ తేదీన భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయము వద్దకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు:కడలి పాండు,జాయింట్ సెక్రెటరీ బొక్కా చంటి,జిల్లాకమిటీ సభ్యులు.బొంతు శ్రీనివాస్,దాసరి సూరిబాబు,కాగిత రాధాకృష్ణ, చింతపల్లి చిన వీర స్వామి, జక్కంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM