Bhimavaram: పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కమిషనర్ రామచంద్ర రెడ్డి!

Bhimavaram: భీమవరం మున్సిపల్ స్పెషల్ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర రెడ్డి.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 22 Aug 2026 5:02 PM IST
Bhimavaram
X

Bhimavaram: పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కమిషనర్ రామచంద్ర రెడ్డి!

Bhimavaram: భీమవరం మున్సిపాలిటీ 6వ వార్డులోని తాడిమళ్ల లక్ష్మీ నరసాంబ మున్సిపల్ స్పెషల్ ప్రైమరీ పాఠశాలను మున్సిపల్ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర రెడ్డి శనివారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు.

అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల సిబ్బందికి కమిషనర్ సూచనలు చేశారు. ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story