Bhimavaram: విజయవాడ సన్‌షైనర్స్ జట్టులో సాయితేజ.. భీమవరంలో సంబరాలు!
Bhimavaram: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-5 వేలంలో భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థి జి. చరణ్ సాయితేజ విజయవాడ సన్‌షైనర్స్ జట్టుకు ఎంపికయ్యారు.
Bhimavaram: విజయవాడ సన్‌షైనర్స్ జట్టులో సాయితేజ.. భీమవరంలో సంబరాలు!
Bhimavaram: యువ క్రికెటర్లకు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదిక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) అని, ఏపీఎల్ క్రికెట్ లీగ్ కు భీమవరం నుంచి ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఏపీఎల్ క్రికెట్ లీగ్ లో విజయవాడ సన్ షైనర్స్ తరుపున ఆక్షన్ లో భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థి జి చరణ్ సాయితేజ ఎంపికయ్యారు.
ఎమ్మెల్యే కార్యాలయంలో సాయి తేజ ను అభినందించి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ -5 జూన్ 5న ప్రారంభం కానున్నాయని, సింహాద్రి వైజాగ్ లయన్స్, కాకినాడ కింగ్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్, విజయవాడ సన్‌షైనర్స్, భీమవరం బుల్స్,
తుంగభద్ర వారియర్స్, రాయలసీమ రాయల్స్ అనే 7 జట్లు పాల్గొంటాయన్నారు. ఈ లీగ్ కు భీమవరం క్రీడాకారుడు సాయి తేజ ఎంపిక కావడం గొప్ప విశేషమని, క్రికెట్ లో రాణించి అంతర్జాతీయ స్థాయికు చేరుకోవాలని అభినందించారు. చెరుకువాడ రంగసాయి, విజ్జురోతి రాఘవులు, తండ్రి జి రమేష్, ఆకుల కృష్ణ, చింతా కనకరావు పాల్గొన్నారు.




