Bhimavaram: "డోర్ టు డోర్" సంక్షేమ పథకాలపై ప్రచారం చేసిన త్రిమూర్తులు!
Bhimavaram: భీమవరం 7వ వార్డులో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలపై డోర్ టు డోర్ ప్రచారం. పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గంటా త్రిమూర్తులు.
Bhimavaram: "డోర్ టు డోర్" సంక్షేమ పథకాలపై ప్రచారం చేసిన త్రిమూర్తులు!
Bhimavaram: సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట సీతారామలక్ష్మీ పిలుపు మేరకు, భీమవరం 7వ వార్డు 137వ బూత్‌లో మావుళ్లమ్మ దేవస్థాన ధర్మకర్త మిర్తిపాటి గున్నేశ్వరావు ఆధ్వర్యంలో గురువారం "డోర్ టు డోర్" కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ డా. త్రిమూర్తులు ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను ఈ సందర్భంగా ఆయన విస్తృతంగా వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తామంతా చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా, సక్రమంగా అందుతున్నాయని, ప్రజోపయోగ కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, పట్టణ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షులు గోలగాని రమేష్, టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రబ్బానీ, దొంగ వెంకటేశ్వరరావు, పురిగేళ్ల ఫణికుమార్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




