Bhimavaram: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కలిసిన భీమవరం మీడియా క్లబ్!

Bhimavaram: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కలిసిన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై చర్చ క్లబ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 29 Sept 2026 7:45 PM IST
Bhimavaram
X

Bhimavaram: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కలిసిన భీమవరం మీడియా క్లబ్!

​భీమవరం: నూతనంగా ఏర్పాటైన భీమవరం మీడియా క్లబ్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మీడియా క్లబ్ నిర్వహణ, జర్నలిస్టుల వృత్తిపరమైన అవసరాలు మరియు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై క్లబ్ సభ్యులు ఆయనతో విస్తృతంగా చర్చించారు.

​మీడియా క్లబ్ ఏర్పాటు లక్ష్యాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రతినిధులు డిప్యూటీ స్పీకర్‌కు వివరించగా, భీమవరంలో జర్నలిస్టుల సంక్షేమం మరియు క్లబ్ కార్యకలాపాల నిర్వహణకు తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, భీమవరం మీడియా క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అన్ని వేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. ​ఈ సందర్భంగా భీమవరం మీడియా క్లబ్ సభ్యులు డిప్యూటీ స్పీకర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఆరేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీఎన్‌ఎల్ మూర్తి, ఉపాధ్యక్షులు సూర్య, కోశాధికారి కేతా సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు గేదెల శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే గౌరవ సలహాదారులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు తాతారావు (వశిష్ట టుడే), రంగబాబు (మహా న్యూస్), బ్రహ్మాజీ (టీవీ5), వర్మ (ఏబీఎన్), అరుణ్ (హెచ్ఎంటీవీ), కృష్ణ (ఆర్ టీవీ), బి.ఆర్.కె. హనుమంతరావు, వెంకట్ (మెగా 9), చిన్నబాబు (విశాలాంధ్ర)తో పాటు తరుణ్, ఆర్.కె. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM