Bhimavaram: భీమవరంలో కలెక్టరేట్ శంకుస్థాపన సీఎం, డిప్యూటీ సీఎంతో జరగాలి!
Bhimavaram: భీమవరంలో 20 ఎకరాల్లో సొంత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి అసెంబ్లీలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు.
Bhimavaram: భీమవరంలో కలెక్టరేట్ శంకుస్థాపన సీఎం, డిప్యూటీ సీఎంతో జరగాలి!
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంగా ఏర్పడిన నాటి నుంచి కలెక్టరేట్ అద్దె భవనంలోను, ఎస్పీ కార్యాలయం రేకుల షెడ్డులో ఉన్నాయని, వాటికీ శాశ్వత పరిస్కారం లభించేలా సహకరించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. గత 3 ఏళ్ళుగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ప్రధాన కేంద్రంగా ఉందని, భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, విద్య, వైద్య, ఆక్వా రంగాలలో శరవేగంగా ముందుకు సాగుతుందని, అయినప్పటికి అద్దె భవనాల్లో జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని, సుమారు 20 ఎకరాల్లో ఈ భవనాలను నిర్మిచాలన్నారు. గతంలో మార్కెట్ యార్డ్ లో కలెక్టరేట్ నిర్మించాలని 124 జీవో వచ్చిందని, కలెక్టరేట్ అనేది ఒక భవనం కాదని, ఒక సముదాయమని, ప్రజలకు అనువైన కార్యాలయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
2047 విజన్ ఆలోచనతో ముందుకు వెళుతున్నారని, జిల్లా కేంద్రమైన భీమవరంలో అన్ని కార్యాలయాలు ఒకే కంపౌండ్ లో ఉండే విధంగా 20 ఎకరాల్లో ఒక కలెక్టరేట్ నిర్మించాలని, ఈ కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. ఈ కలెక్టరేట్ నిర్మాణానికి సహకరించాలని, ఈ కలెక్టరేట్ శంకుస్థాపనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగాలని కోరుతున్నామని అన్నారు. భీమా ఉడా ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.




