Bhimavaram: పల్లె పండగ 3.0లో పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Bhimavaram: భీమవరం మండలంలో పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో రోడ్లకు శంకుస్థాపనలు, సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Updated on: 7 Oct 2026 11:30 PM IST
Bhimavaram
X

Bhimavaram: పల్లె పండగ 3.0లో పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భీమవరం: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి పల్లెలకు కొత్త రూపు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.

బుధవారం భీమవరం మండలంలోని తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యల తిప్ప, కోమటితిప్ప నార్త్, రామాయణం పురం, దిరుసుమర్రు, యనమదుర్రు గ్రామంలో పల్లె పండగ 3.0 లో భాగంగా పలు రోడ్లకు శంకుస్థాపనలు, పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇదే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పెద్దలు, గ్రామస్థులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM