Bhimavaram: మావుళ్లమ్మ శరన్నవరాత్రుల ఉత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ

Bhimavaram: భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాల బుక్‌లెట్‌ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈనెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 7 Oct 2026 11:31 PM IST
Bhimavaram
X

Bhimavaram: మావుళ్లమ్మ శరన్నవరాత్రుల ఉత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ

భీమవరం: భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు జరుగుతాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం ఎమ్మెల్యే నివాసం వద్ద దసరా ఉత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించారు.

అమ్మవారికి ఈనెల 11 నుంచి 20 వ తేది వరకు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారని, భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలన్నారు.

ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ 10 రోజులుపాటు అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు జరుగుతాయని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలను క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 22న అన్న సమారాధన జరుగుతుందన్నారు. ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం, ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, పాలకవర్గ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM