Bhimavaram: రాజకీయాల్లోకి కనకరాజు సూరి కుమార్తె రోహిణి ఎంట్రీ!

Bhimavaram: భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి పోటీ చేయనున్నట్లు కనకరాజు సూరి కుమార్తె వేగేశ్న రామ బంగారు రోహిణి ప్రకటించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 15 Oct 2026 4:21 PM IST
Bhimavaram
X

Bhimavaram: రాజకీయాల్లోకి కనకరాజు సూరి కుమార్తె రోహిణి ఎంట్రీ!

​భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం రాజకీయ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ సీనియర్ నేత, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి కుమార్తె వేగేశ్న రామ బంగారు రోహిణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానానికి పోటీ చేయనున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులను మర్యాదపూర్వకంగా కలిసి తనకు మద్దతు కోరడంజరిగింది. ఈసందర్భంగాఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో జనసైనికులు, వీర మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై తమ మద్దతు తెలిపారు. సమావేశంలో రామ బంగారు రోహిణి మాట్లాడుతూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నాటి నుంచే మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి తమ కుటుంబం నిరంతరం ప్రజలకు సేవ చేయడం కోసమే పనిచేస్తోందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకే తానుప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశయాలు మరియు స్ఫూర్తితో భీమవరంలో అవినీతి రహిత పాలన అందిస్తామని రామ బంగారు రోహిణి హామీనిచ్చారు. పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తూ, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దమే తన ప్రధాన ధ్యేయమని ఆమె వెల్లడించారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తనను మీ కుటుంబంలో ఒక సోదరిగా, కుమార్తెగా భావించి అండగా నిలవాలని ఆమె పార్టీ శ్రేణులను కోరారు. జనసేన విజయమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేసి తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM