Bhimavaram: ఎమ్మెల్యే అంజిబాబుకు మార్కెట్ కమిటీ ఉద్యోగుల వినతి
Bhimavaram: పశ్చిమగోదావరి భీమవరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుకు వినతిపత్రం.
Bhimavaram: ఎమ్మెల్యే అంజిబాబుకు మార్కెట్ కమిటీ ఉద్యోగుల వినతి
Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) కు ఏపీ వ్యవసాయ మార్కెట్ కమిటీల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ సభ్యులు వినతి పత్రాన్ని అందించారు.
రాష్ట్ర కోశాధికారి వి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రాష్ట్రంలో యార్డ్ అసిస్టెంట్స్, అటెండర్స్, వాచ్ మెన్స్, డిఓఈ లు సుబాబుల్ అసిస్టెంట్స్ తదితర పేర్లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా 30 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని, మార్కెట్ కమిటీలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి మినిమం టైం స్కేల్ జీతాలు చెల్లించాలన్నారు.
రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటి చెల్లించాలని, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులలో అర్హులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. డిజిటల్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అభద్రత లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని,
ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ 10 లక్షలు ఎక్నేపియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకుని వెళ్ళి న్యాయం చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు ను కోరారు. యూనియన్ సభ్యులు బోల్లం కిషోర్, సిహెచ్ ప్రేమానందం, వి శ్రీనివాస రావు, రామాంజనేయులు పాల్గొన్నారు.




