Bhimavaram: భీమవరంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

Bhimavaram: భీమవరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినా మారని మున్సిపల్ అధికారుల వైఖరిపై విమర్శలు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 22 July 2026 9:31 PM IST
Bhimavaram
X

Bhimavaram: భీమవరంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అక్రమ కట్టడాల పర్వం అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతోంది. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఎటువంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధికారుల అవినీతిపై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారుల వైఖరిలో ఎలాంటి మార్పూ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించినప్పటికీ అధికారుల తీరు మారకపోవడం వెనుక కారణాలపై పట్టణంలో పలు అనుమానాలు, చర్చలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story