Narasapuram: నరసాపురంలో అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఘన సత్కారం!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తెలగ కళ్యాణ మండపంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్వాడి ఉత్సవం నిర్వహించి అంగన్వాడి, ఆశా కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.
Narasapuram: నరసాపురంలో అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఘన సత్కారం!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తెలగ కళ్యాణ మండపంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్వాడి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తలు, ఆశా దీదీలను ఘనంగా సత్కరించారు.
చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం, పోషకాహారం, పోషకాహార లోపం నివారణపై చర్చించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని వక్తలు పేర్కొన్నారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాగా సత్యనారాయణ, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పాల్గొని అంగన్వాడి, ఆశా కార్యకర్తల సేవలను అభినందించారు.




