Penugonda: నూకరాజు కుటుంబం మృతిపై సమగ్ర విచారణ జరపాలి: బీజేపీ!

Penugonda: ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెనుగొండ పోలీసులకు బీజేపీ వినతిపత్రం అందజేసింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 24 Aug 2026 11:31 PM IST
Penugonda
X

Penugonda: నూకరాజు కుటుంబం మృతిపై సమగ్ర విచారణ జరపాలి: బీజేపీ!

పెనుగొండ: ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం రాజమహేంద్రవరం గోదావరి వంతెనపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో వినతిపత్రాలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా, పెనుగొండ మండల బీజేపీ అధ్యక్షులు దొడ్డిపట్ల నాగూర్ ఆధ్వర్యంలో సోమవారం పెనుగొండ పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నూకరాజు కుటుంబం మృతికి కారణమైన షేక్ సాదిక్ ఖాన్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి విషాదకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా, మతాంతర వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

బాధితుల ఫిర్యాదుల్లో ఏవైనా మోసం, ఒత్తిడి, కుట్ర లేదా ఇతర చట్టవిరుద్ధ అంశాలు ఉన్నాయా అనే విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించి, బాధితులకు న్యాయం చేయడంతో పాటు నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇరగవరపు రాధాకృష్ణ, పొదల సుమన్, బిరుదుకోట సుబ్రహ్మణ్యం, బొబ్బిలి సత్యనారాయణ, పడాల విష్ణు, శిష్ట మణికంఠ, ఉటాల చంటి, టీడీపీ నాయకులు అంగర వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story